ప్రేమ అన్నది ఒక శాశ్వత భావన. ఈ భావనలేని సమయాన్ని ఊహించడం దుర్భరం. సఫలమైన ప్రేమ కబుర్లు మనసును పులకింపచేస్తాయి. అలాగే ప్రేమ విఫలమైనా అందులోని త్యాగం మన కళ్ళముందు ప్రతిఫలిస్తూనే ఉంటుంది. మరి ఈ భావనలకు ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రేమ లేఖలు. ఇందులో పెద్ద, చిన్న తేడా లేదు. మరి అలనాటి ప్రేమికుల ప్రేమలేఖలను పరికిద్దామా...
అబ్రహం లింకన్ ప్రేమ లేఖ
ఈ లెటర్‌తో కలిపి ముందు రెండు లెటర్లు వ్రాయడం ఆరంభించాను. రెండింటి వల్ల నాకు తృప్తి కలగలేదు. అవి నీకు పంపకుండానే చింపేసాను. మొదటి లేఖ కొంచెం కూడా హూందాగా లేదు. రెండవది కొంచెం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఈ లేఖ ఎలా ఉన్నా పంపాలని నిర్ణయించుకున్నాను. స్ప్రింగ్ ఫీల్‌డలో జీవితం చాలా కష్టంగా వుంది. నేను నా జీవితంలోని ప్రతి దశలోను ఒంటరి తనం అనుభవిస్తు వచ్చాను. అదే విధంగా ఇక్కడ కూడ ఒంటరితనం తప్పలేదు. ఇక్కడకు నేను వచ్చిన తర్వాత ఒకే ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది. అదికూడ నాతో మాట్లాడడానికి కాదు, నా దగ్గరకు రావలసిన అవసరం ఏర్పడి నాతో మాట్లాడినది. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గిర్జా వెళ్ళలేదు బహుశ ఇప్పట్లో వెళ్ళనేమో. నేను అందరితోనూ ముహాభావంగా ఉంటున్నాను. ఎందుకంటే ఎదుటివానితో ఏవిధంగా వ్యవహరించాలో నాకు తెలియదు. మనం అనుకున్నట్లు స్ప్రింగ్ ఫీల్‌డలో మనం ఏ విధంగా ఉండాలని భావించామో అలా జరగదని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. నువు్వ ఇక్కడ సంతోషంగా ఉండలేవని నేను భయపడుతున్నాను...
ఇక్కడ ఉండగలవని నీకు నమ్మకం ఉందా..? తలచుకుంటే ఏ స్త్రీ అయినా సరే నా జీవితంలో అడుగుపెట్టి సంతోష పడుతుంది. అలా జరగాలని నేను కోరుకుంటున్నాను. లేనట్లయితే నా దురదృష్టం. నీతో జీవించివున్నా నా జీవితం బాధగానే ఉంది. నాకు నీలో విచారపు ఛాయలు కనిపిస్తే నా సుఖమంతా వృధా. కనుక సరదాకి కూడా ఆ మాట అనవద్దు. బహుశా నేను నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నానేమో. ఇదే నిజమైతే బాగున్ను. ఇక ఈ విషయం వదిలెద్దాం. నీవు నన్ను సరగ్గా అర్ధం చేసుకుంటే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నాను. నువ్వు నిజంగా నాతో జీవించేందుకు సిద్ధమైతే నేను చెప్పేది నీవు పాటించాలి. నీకు కష్టపడ్డం తెలియదు. కనుక నేను చెప్పినట్లు చేయకపోవడమే మంచిది. ఈ జీవితం నీ ఊహలకు తగినట్లుగా లేదు. అయినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకున్నాక నీ ఉద్దేశం ప్రకారం నేను నిన్ను అనుసరిస్తాను. ఈ లేఖ అందించిన తర్వాత నీవు నాకు ఒక పెద్ద ఉత్తరం రాయవలసిందిగా కోరుతున్నాను. నీవేం రాయాలనుకుంటే అదే వ్రాయు. కనీసం నా జీవితంలో అది ఒక మంచి స్నేహితురాలిగా పనిచేస్తుంది........
నీ లింకన్ .....
1 comment:
pandu
Post a Comment